మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి,బొల్లం మల్లయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి
చిలుకూరు,ఏప్రిల్ 30(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్చి:లుకూరు మండల పార్టీ అధ్యక్షులు కిత వెంకటేశ్వర్ల,పిండ్రాతి హనుమంతరావు ఆదేశాల మేరకు నిన్న జరిగిన నడిగూడెం మండల టిఆర్ఎస్ పార్టీ సభలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి,బొల్లం మల్లయ్య అనుచిత వ్యాఖ్యలను చిలుకూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఈ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పది సంవత్సరాల లో దున్నపోతు మీద వాన పడ్డట్టు బిఆర్ఎస్ పరిస్థితి ఉందని అన్నారు.కోదాడ నియోజకవర్గ ప్రజల తీర్పు 60 వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది.ముళ్ళు కర్ర పొడుగు లేని మాజీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ మండలాలలో కూడా తిరగనివ్వమని హెచ్చరిస్తున్నారు.అభివృద్ధి అంటే మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఉత్తమ్ పద్మావతి రెడ్డి గెలిచిన నాలుగు నెలల్లోనే మా కోదాడ నియోజకవర్గానికి 220 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్న తరుణంలో 10 సంవత్సరాల అహంకారంతో కండ్లు మూసుకుపోయిన టిఆర్ఎస్ వాళ్ళకి మొన్ననే తెలంగాణ మొత్తం కూడా ఓట్లతో బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదన్నారు.



