రిజర్వేషన్లు కాపాడుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలి
కోదాడ,మే 05(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు రద్దు కాకుండా ఉండాలంటే మన రాజ్యాంగం ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు మొత్తం ఏకమై మతతత్వ బీజేపీని ఓడించాలి ఈ సారి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలాగైతే తెచ్చామో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలో తెచ్చి రాహుల్ గాంధీ ని ప్రధానిని చేద్దాం కావున మనం మన బాధ్యతగా నల్లగొండ పార్లమెంటు ఎన్నికలలో కుందూరు రఘువీర్ రెడ్డి ని అధిక మెజారిటీతో గెలిపించాలని మోడీకో హటావో దేశ్ కో బచావో అంటున్న కోదాడ నియోజకవర్గ ముస్లిం మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్ నజీర్ తెలిపారు.



