బిజెపితోనే అభివృద్ధి సాధ్యం నల్లగొండ పార్లమెంటు బిజెపి పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి
కోదాడ,మే 10(mbmtelugunews )ప్రతినిధి మాతంగి సురేష్:బిజెపితోనే దేశం నలుమూలల అభివృద్ధి చెందుతుందని నల్లగొండ పార్లమెంటు బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చిలకమూడి విశ్వేశ్వరరావు,మాజీ ఎంపీటీసీ చిలకమూడి నవీన,చిలకమూడి రవికుమార్,గోల్ తండా మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు వీరితో పాటు అమీనాబాద్ గ్రామం నుండి 200 కుటుంబాలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి వారికి బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా చిలకమూడి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ బిఆర్ఎస్ వల్ల అభివృద్ధి ఏమి ఉండదని,ఒక భారతీయ జనతా పార్టీతోనే అభివృద్ధి సాధ్యం,దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కొండమడుగుల బుల్లెట్,దాసరి ఉపేందర్,పోయల నాగరాజు,చంద్రకళ,సంపూర్ణ,నాగరాణి,వియ్యాల పద్మ,వెంకటేశ్వర్లు,అంకటి పూర్ణయ్య,రమాదేవి,ఉపేంద్ర,మీసాల వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



