తెలుగుజాతికి గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్……
తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి ఉపగండ్ల సరోజ
కోదాడ,మే 28(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని తెలంగాణ టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి ఉపగండ్ల సరోజ,ముత్తినేని సంద్యారాణి అన్నారు.మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ఎస్వీ జూనియర్ కాలేజీలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలకు వన్నె తెచ్చిన మహనీయుడని,బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో పెద్దపీట వేసి సినీ రంగం,రాజకీయ రంగంలో తనదైన శైలిలో ప్రజల ఆధర అభిమానాలు పొందడంతో పాటు రాష్ట్ర,జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రజలకు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని,తెలుగుజాతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయుడని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.

అనంతరం వారి చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో అనంతగిరి మండల అధ్యక్షులు చాపల శ్రీను,చిలుకూరు మండల నాయకులు కొండ సోమయ్య,ఉపగండ్ల శ్రీనివాసరావు,సహదేవ్,కొల్లు సత్యనారాయణ,షేక్ బాబా షరీఫ్ఫద్దీన్,ముండ్రా రవికుమార్,కొత్త రాంబాబు,గంధం రామకృష్ణ,కొత్త సజ్జా రామ్మోహన్రావు,నెల్లూరి వెంకటేశ్వరరావు,షేక్ హబీబ్,చావా హరినాద్,కొత్త నరేష్ రెడ్డి,కొత్త హనుమాన్ రెడ్డి,కోదాటి లక్ష్మీనారాయణ,మాదాల రాంబాబు, ముత్తవరపుకోటేశ్వరారవు,గద్దేవెంకటేశ్వరావు,తూమాటి పున్నయ్య,కనగాల శ్రీనివాసరావు,తమ్మినేని బాబు,ముత్తవరపు కోటేశ్వరరావు,బొర్రా హనుమంతరావు,ఏడుకొండలు,ముండ్రా సత్యనారాయణ,ఏటుకూరి సురేష్,కొదాడ రేవంత్ రెడ్డి,బత్తినేని రవీంద్ర,జమ్ముల శ్రీను.కనగాల రామకృష్ణ,లింగనబోయిన శేఖర్,నర్రా రమేష్,బండారు వెంకటేశ్వర్లు,దేవినేని వెంకటప్రసాద్,నువ్వుల సుభ్భారావు,సక్కుబాయమ్మ,విజయలక్మి,సత్యావతి,భారతి,లక్మి తదితరులు పాల్గొన్నారు



