తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఆలేటి రాంబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు
కోదాడ,జూన్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం పట్టణంలోని శనగల రాధాక్రిష్ణ దివ్యాంగుల అనాధాశ్రమంలో తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఆలేటి రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కోదాడ కాంగ్రెస్ నాయకులు ఆలేటి రాంబాబు,కనగాల నాగేశ్వరావు,కోదాడ కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి,ఉపా ధ్యక్షులు సుందరి వెంకటేశ్వర్లు,కర్రి సుబ్బారావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆలేటి రాంబాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు మానసిక వికలాంగుల ఆశ్రమంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.రాబోయే రోజులలో మరెన్నో మంచి పదవులు ఆశించి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మైలారి శెట్టి సైదయ్య,తుమాటి నాగిరెడ్డి,షేక్ షరీఫ్,కోసూరి నరేష్,సట్టు కరున్,సతీష్ నాయుడు,పోతుల కిషోర్,ఉప్పతల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



