ఊడిన బస్సు టైర్లు::తప్పిన భారీ ప్రమాదం
Mbmtelugunews//జగిత్యాల జిల్లా,ఆగస్టు 18 ప్రతినిధి మాతంగి సురేష్:జగిత్యాల జిల్లాల్లో ఆర్టీసీ బస్సుకు తృటిలో భారీ పెను ప్రమాదం తప్పింది.నిర్మల్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఈరోజు ఉదయం జగిత్యాల నుండి వెళుతుండగా మొరపెల్లి వద్ద బస్సు వెనుక టైర్లు రెండు ఊడిపోయాయి.

దీంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది,ఎవరికీ ఏమీ జరగలేదు.అయితే 50 మంది ప్రయాణించ వలసిన బస్సులో150 మంది ఎక్కారు. అందులో 100 మంది తెలంగాణ మహాలక్ష్మిలు ఉండడం గమనీయం.



