Saturday, July 5, 2025
[t4b-ticker]

సీతాఫలం ఆకులతో ఎన్నో ఫలితాలు

సీతాఫలం ఆకులతో ఎన్నో ఫలితాలు

:ఆకులు ఇలా వాడితే షుగర్,బీపీ కంట్రోల్ అవుతాయి..

Mbmtelugunews//హెల్త్ టిప్స్: సీతాఫలం పండులోనే కాదు.. సీతాఫలం చెట్టు ఆకుల్లో కూడా బోలెడు పవర్ ఉంది.ఈ ఆకులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.సీతాఫలం ఇప్పుడు మార్కెట్‌లో ఎక్కువగా దొరుకుతుంది.ఈ పండును చాలా మంది ఇష్టంగా తింటుంటారు. సీతాఫలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి.విటమిన్ సి,యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నిషియం ఎన్నో ఖనిజాలు,పోషకాలు ఉన్నాయి. ఈ ఫలంలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి.ఇవి ఎన్నో రోగాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, సీతాఫలం పండులోనే కాదు..సీతాఫలం చెట్టు ఆకుల్లో కూడా బోలెడు పవర్ ఉంది.ఈ ఆకులో యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ ఆకులు శరీరానికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.సీతాఫలం ఆకులు డయాబెటిస్ పేషంట్లకు ఓ వరం అని చెప్పవచ్చు.ఈ ఆకులు రక్తంలో షుగర్ స్థాయిల్ని నియంత్రణలో ఉంచుతాయి.ఈ ఆకుల్ని నీటిలో మరగబెట్టి..ఆ నీటిని తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ఇది ఇన్సూలిన్‌గా పనిచేస్తుందని వారు చెబుతున్నారు.ఈ రోజుల్లో చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు.ఇలాంటి వారికి సీతాఫలం ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి.ఈ ఆకులో పొటాషియం,మెగ్నిషియం వంటి ఖనిజాలు ఉంటాయి.ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.దీంతో బీపీ కంట్రోల్‌లో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడిస్తున్నారు.సీతాఫలం ఆకుల్లో యాంటీ ఫంగల్,యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.ఇవి చర్మ వ్యాధుల్ని తగ్గించడంలో సాయపడతాయి.ఈ ఆకును మెత్తగా పేస్టులా చేసి చర్మంపై అప్లై చేయాలి.మొటిమలు,ఎర్ర దద్దుర్లు, మంట,తామర వంటి లక్షణాల్ని ఈ పేస్టు అప్లై చేయడం వల్ల తగ్గుముఖం పడతాయి.చలికాలంలో ఈ పేస్టు ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల చర్మం పొడిబారదు.ముఖం నిగనిగలాడుతుంది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular