కరాటే,చెస్ పోటీల్లో తేజ విద్యార్థులు.
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 10(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు చదువుచున్న జె తుహిన శ్రీ (1 వ తరగతి )విద్యార్థిని నేషనల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ వరంగల్ లో నిర్వహించిన కరాటే పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు.అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్ 15 చెస్ టోర్నమెంట్ సూర్యాపేట నిర్వహించిన పోటీల్లో అండర్ 11 విభాగంలో డి శామ్యూల్,శర్వన్ తో పాటు బి కార్తికేయ,సత్యానంద సాయి అనే విద్యార్థులు ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థానాల్లో బహుమతులు సాధించారు.సోమవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం అప్పారావు,సెక్రెటరీ వై సంతోష్ కుమార్,వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్,ఇన్చార్జులు రేణుక,రామ్మూర్తి,పీఈటీలు రాంబాబు,గణేష్ ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



