పాలడుగు వెంకట శివప్రసాద్ అలియాస్ పెద్దబాబు మరణం ప్రజలకు తీరని లోటు
Mbmtelugunews//కోదాడ,జూన్ 12(ప్రతినిది మాతంగి సురేష్):సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామానికి చెందిన పాలడుగు వెంకట శివ రామ ప్రసాద్ సుదీర్ఘ రాజకీయాలను కలిగి గ్రామంలో అందరితో కలవలుపుగా ఉంటూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిచితుడైన (పెద్దబాబు) మరణం మండలానికి తీరని లోటు లోటు.తన తండ్రి పాలడుగు మాధవరావు చెన్న కేశవపురం,కరివిరాల ఈ రెండు గ్రామ పంచాయతీ లను 20 సంవత్సరాలు ఏకాదటి గా ఇనాన్ మస్ గా పరిపాలనా అనుభవం కలిగిన గొప్ప మనిషి అతని పెద్ద కుమారుడు పాలడుగు వెంకట శివ రామ ప్రసాద్ (పెదబాబు ) తన తండ్రి వారసత్వ ని 17 వ ఎటనే అనగా ఇంటర్ చదువుతున్న రోజులోనే తండ్రి దగ్గర నేర్చుకొని అలనాటి నుండి నిన్నటి వరకు తన రాజకీయ మహా ప్రస్తాన యాత్ర ను కొనసాగించి గుండె పోటుతో బుధవారం పరమపదించారు అను వార్తను నమ్మలేక పోతున్న చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అందుకు నిదర్శనం మరణ వార్త తెలిసిన సమయం నుండి కడసారిగా చూడడానికి తరలివస్తూ ఉండడమే.అయన పంచాయతీ తీర్పులు (గొడవలను)చాలా చాక చక్యం గా తిరుపు చెప్పేవారు.ఆయన నీటి సంఘ చైర్మన్ గా,ఎంపీటీసీగా,సర్పంచ్ గా,ఇలా ఎన్నో పదవులు చేపట్టారు.ఆయన మరణం చెన్నకేశవపురం గ్రామానికి తీరని లోటు.తండ్రి కాంగ్రెస్ పార్టీ నుండి పలుమార్లు గ్రామ సర్పంచ్ గా పని చేసి ఉన్నారు.అదే ఆ విధమైన వారసత్వమని తను కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యుడిగా టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యుడిగా కొనసాగుతున్నారు.అతని భౌతిక గాయాన్ని ఈరోజు బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి ముఖ్య నాయకులు దేవబత్తిని సురేష్ ప్రసాద్,మార్తి ఉపేందర్,కలకొండ పిచ్చయ్య,ప్రమీల రెడ్డి,రత్నవరం గ్రామ శాఖ అధ్యక్షుడు పోలంపల్లి వెంకటేశ్వర్లు,కార్యకర్తలు వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.