సేవా పక్వాడ్ తెలంగాణ విమోచన కార్యక్రమం
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 15(ప్రతినిధి మాతంగి సురేష్): మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ కెఆర్ఆర్ కాలేజీ ఆవరణలో రైతు కెనాల్ కాలువలో చెత్తాచెదారం, మద్యం బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ కాలవలో పేరుకుపోయినవి సంబంధిత అధికారులు వాటిని పట్టించుకోకపోవడం వలన ఆ ప్రాంతంలో దోమలు బెడద ఎక్కువయి కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు కుట్టడం వలన వారు జ్వరాల బారిన పడుతున్నారని బిజెపి నాయకుల ఆధ్వర్యంలో
మున్సిపల్ కమిషనర్, కాలేజీ ప్రిన్సిపల్ లకు వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మున్సిపల్ కమిషనర్ ఆ పనికి ఆటంకం కలిగించినది దానికి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో. సేవా పక్వాడ్ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు,తెలంగాణ బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అలాగే సూర్యాపేట జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో సేవా పక్వాడ్, తెలంగాణ విమోచన సందర్భంగా, భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించే మన నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సేవ పక్వాడ్ కార్యక్రమంలో పాల్గొన జరిగింది.ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, కో కన్వీనర్ జల్లా జనార్దన్ రావు, కోదాడ పట్టణ సేవ పక్షం కన్వీనర్, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు వంగాల పిచ్చయ్య, కేఆర్ఆర్ కళాశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.



