హెచ్ పివి వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలి.
: సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 20( ప్రతినిధి మాతంగి సురేష్): హెచ్ పివీ వ్యాక్సిన్ ను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచి పాలకి సురేష్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం హెచ్ పివి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచి పాలకు సురేష్ పాల్గొని వ్యాక్సిన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హెచ్ పివి గర్భాశయ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ టీకాను 14 సంవత్సరాల ఆడపిల్లలు వేయించుకోవాలని అన్నారు. గతంలో ఈ వ్యాక్సిన్ లేక ఎంతో మంది క్యాన్సర్ పాడిన పడినారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా వ్యాక్సిన్ రావడం మన అదృష్టంగా భావించాలని తెలిపారు. 10 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఏఎన్ఎం మీనా కుమారి, సెక్రటరీ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్స్ కృష్ణవేణ, నాగమణి, ఆశా వర్కర్లు ఎల్లమ్మ, అరుణ, గ్రామ మహిళలు పాల్గొన్నారు.



