Thursday, September 24, 2026
[t4b-ticker]

రేవంత్ రెడ్డిపై విషప్రచారం మానుకోవాలి..

రేవంత్ రెడ్డిపై విషప్రచారం మానుకోవాలి..

:ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

:కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ లు ఘాటు హెచ్చరిక.

Mbmtelugunews//కోదాడ, జూన్ 30 : నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు ప్రజల నుంచి లభించిన అపూర్వ స్పందనను చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక అసత్య ప్రచారాలకు దిగుతున్నారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ లు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

*సభ విజయాన్ని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ బురదజల్లే రాజకీయాలు*

నల్గొండ సభ విజయవంతం కావడంతో ప్రజల్లో కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకత్వం భయాందోళనకు గురైందన్నారు. అందుకే ప్రజల దృష్టి మరల్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు, అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు.

*ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక హక్కు మల్లయ్య యాదవ్‌కు ఉందా..?*

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే ముందు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలని రావెళ్ల కృష్ణారావు సూచించారు. తన హయాంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియాలకు అండగా నిలిచి కోట్ల రూపాయల దోపిడీ జరిగిందనే ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

*సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో, పోలీస్ అధికారుల నుంచి డబ్బుల వసూళ్లు నిజం కాదా..?*

ముఖ్యమంత్రిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే ముందు, తన పాలనలో  సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, పోలీసు శాఖ అధికారుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

**దళిత బంధు లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేసినది ఎవరు..?**

దళిత బంధు పథకం అమలులో లబ్ధిదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ ఆరోపణలు అబద్ధమైతే బహిరంగంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

**వైన్ షాపుల సిండికేట్ వెనుక ఎవరి పాత్ర..?**

వైన్ షాపుల కేటాయింపుల్లో బినామీలను రంగంలోకి దింపి, పెట్టుబడి పెట్టకుండానే సిండికేట్‌ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

**కబ్జా రాజకీయాలు చేసిన వారు నైతికత గురించి మాట్లాడటం విడ్డూరం**

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “చీటర్” అని సంబోధించే ముందు కోదాడ ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద కోట్ల రూపాయల విలువైన ఆస్తి కబ్జా ఆరోపణలపై బొల్లం మల్లయ్య యాదవ్ సమాధానం చెప్పాలని అన్నారు. ఇతరులపై వేలెత్తి చూపే ముందు తనపై ఉన్న ఆరోపణలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

**పదవులు అమ్ముకున్నారనే ఆరోపణలకు సమాధానం చెప్పాలి**

తన హయాంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలు, ఎంపీపీ, సొసైటీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షుల నియామకాల కోసం భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు.

**టికెట్ కోసం ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా..?**

కేసీఆర్, కేటీఆర్ వద్ద పార్టీ టికెట్ పొందేందుకు ఎంత మొత్తం ఖర్చు చేశారో ప్రజలకు వెల్లడించాలని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ లు డిమాండ్ చేశారు. ఇతరులపై ఆరోపణలు చేసే ముందు తన రాజకీయ ప్రయాణంపై నిజాలు చెప్పాలని సూచించారు.

**ఆధారాలు ఉంటే బయటపెట్టండి… లేకపోతే క్షమాపణ చెప్పండి**

కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకున్నారని చేస్తున్న ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా లేదన్నారు. నిజంగా ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు తీసుకురావాలని, లేకపోతే అబద్ధపు ప్రచారాన్ని వెంటనే నిలిపివేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

**అసత్య ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారు**

ప్రజా తీర్పును గౌరవించకుండా అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలతో రాజకీయాలు చేసే బీఆర్ఎస్‌కు రానున్న రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, మైలారి శెట్టి భాస్కర్ లు హెచ్చరించారు. ఆధారాలు లేని ఆరోపణలు, వ్యక్తిత్వ హసనానికి పాల్పడితే కాంగ్రెస్ పార్టీ చట్టపరంగానూ, రాజకీయంగానూ గట్టిగా ఎదుర్కొంటుందని స్పష్టం చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular