Wednesday, August 5, 2026
[t4b-ticker]

వారాంతపు అంగడిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

వారాంతపు అంగడిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

:అంగడి ఏర్పాటు వలన రైతులకి ఎంతో మేలు.

:రైతులు పండించిన పంటను నేరుగా రైతులే అంగడిలో అమ్ముకోవచ్చు.

:ఏఎంసి చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుధీర్.

:మంత్రి ఉత్తమ్ దంపతుల సహకారంతో గ్రామాభివృద్ధి కృషి చేస్తా

:సర్పంచి దున్నా శ్రీనివాస్ .

Mbmtelugunews//కోదాడ//నడిగూడెం,ఆగష్టు 04(ప్రతినిధి మాతంగి సురేష్): మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వారాంతపు అంగడిను మండల వ్యాప్తంగా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. మంగళవారం నడిగూడెం మండల కేంద్రంలో గ్రామ సర్పంచి దున్న శ్రీనివాస్, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారాంతపు సంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మండలంలోని పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు వారాంతపు సంత ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అంగడి వలన రైతులకు ఎంతో మేలని రైతులు పండించిన పంటని డైరెక్టుగా రైతులే అమ్ముకోవచ్చని అన్నారు. మండల అభివృద్ధికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ల సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.

మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వారాంతపు సంతను, మండలానికి ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. సర్పంచి దున్నా శ్రీనివాసు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తాజా కూరగాయలను సరసమైన ధరలకు అందించాలని వ్యాపారస్తులను కోరారు. గ్రామ ప్రజల ఆకాంక్షల మేరకే గ్రామంలో అంగడి ఏర్పాటు చేశామని ప్రజలందరూ ఉపయోగించుకోవాలన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆశీస్సులతో, గ్రామ ప్రజలందరికీ సహకారంతో పాలకవర్గ సభ్యులతో కలిసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచి ఎలుగురి నాగరాజు, వార్డు సభ్యులు లింగయ్య, మనిషా, విజయ నాగరాజ్, రామకృష్ణ, సరస్వతి రాము, సతీష్ కుమార్, శైలజ సతీష్, మహేందర్, ప్రసాద్, మాదవి, గోపినాద్, మాజీ సర్పంచులు, నాగలక్ష్మి, మల్లేష్ యాదవ్, సత్యనారాయణ, సుధాకర్, మాజీ ఎంపిటిసి పందిరి వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు..

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular