పోలీస్ విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలకు గుర్తుగా ప్రశంసా పత్రం
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 15(ప్రతినిధి మాతంగి సురేష్) : పోలీస్ విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తూ క్రైమ్ ను శాఖ చక్యంగా చేదిస్తున్నందుకుగాను మాదాసు రామారావు ఉత్తమ పోలీస్ గా ఎంపికయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ చేతుల మీదుగా ఉత్తమ పోలీస్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. కోదాడ పరిధిలో విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు రామారావును జిల్లా ఉత్తమ పోలీస్ గా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ పోలీస్ గా అవార్డు అందుకున్న రామారావును పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగస్తులు అభినందించారు.



