ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 02(ప్రతినిధి మాతంగి సురేష్ ): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇర్లా నారపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మందుల నాగయ్య, సీనియర్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డి లు పాల్గొని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఇర్ల నారపరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలితంగా తెలంగాణ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు.అనంతరం ఇర్ల నారపరెడ్డి, వారి బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, చింతా వెంకట్ రెడ్డి, వైఎస్సార్ అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైయస్సార్ కు నివాళులు అర్పించారు.



