Thursday, September 3, 2026
[t4b-ticker]

బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో ఏమైనా అర్థం ఉందా?

బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో ఏమైనా అర్థం ఉందా?

:మాజీ జెడ్పిటిసి బాణాల కవిత నాగరాజు

Mbmtelugunews//నడిగూడెం, సెప్టెంబర్ 02 : ఈరోజు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో ఏమైనా అర్థం ఉందా మాజీ జెడ్పిటిసి బాణాల కవిత నాగరాజు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2014 ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు మిగులు బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ ఆరోజు ఇచ్చింది ఈరోజు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అప్పుల రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పింది.. అయినా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోతు ఎన్నో సంక్షేమ పథకాలు ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆపకుండా ఈరోజు మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా మహాలక్ష్మితో పాటు గృహలక్ష్మి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటుని అందిస్తూ అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేస్తూ ఈరోజు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క పేదవాడు సన్న బియ్యం తినేలాగా సన్నబియ్యాన్ని ఇస్తూ ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని అన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావంటే అది బిఆర్ఎస్ పార్టీ నాయకులకి విజ్ఞతకు వదిలేస్తా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా పదికాలాలపాటు అధికారంలో ఉండాలి ఉంటేనే ప్రజా సంక్షేమం జరుగుద్ది అనేది ప్రజల ఉద్దేశం కాబట్టి ఏదేమైనా ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్, మాజీ జెడ్పిటిసి బాణాల కవిత నాగరాజ్ అన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular