క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి తోడ్పడతాయి.
:చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి : ఏఎంసి చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్.
Mbmtelugunews//నడిగూడెం 10(ప్రతినిధి మాతంగి సురేష్): విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. గురువారం నడిగూడెం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి వనం సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి అండర్ 14, అండర్ 17 క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం క్రీడలకు అధికంగా నిధులను కేటాయిస్తూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికై మన మండలానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని క్రీడాకారులను కోరారు. రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ల సహకారంతో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామన్నారు.

ఈ సందర్భంగా మొదటగా క్రీడా ప్రముఖుడు హకి క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి, పాఠశాల దాత కొల్లు పాపయ్య చౌదరి విగ్రహానికి పూల మాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఐ తేజస్విని, సర్పంచి దున్నా శ్రీనివాసులతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఆంజనేయులు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రఘు, శ్రీదేవి, క్రీడా పోటీల నిర్వాహక కన్వీనర్ పిడి నవీన్, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



