ఇచ్చే మనసు లేదు… అడిగితే ఇవ్వాలనే మనసు లేదు… ఇచ్చే వారిపై ఏలెత్తి చూపడం సరికాదు.
:కోదాడ మెగా జాబ్ మేళాపై బురదజల్లడం కాదు… నిరుద్యోగ యువత భవిష్యత్తుపై మాట్లాడాలి.
:మీ సమయంలో మీరు ఏం చేశారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
:నిరుద్యోగ యువత, ప్రజలు గమనిస్తున్నారు తస్మత్ జాగ్రత్త.
:మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్‌పర్సన్ & మాజీ జెడ్పిటిసి బాణాల కవిత నాగరాజ్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 16 :కోదాడ నియోజకవర్గంతో పాటు పరిసర జిల్లాల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే మంచి ఉద్దేశంతో మంత్రి వర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పర్యవేక్షణలో సెప్టెంబర్ 19న కోదాడలోని సీసీ రెడ్డి కాన్వెంట్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకు పెద్ద సంఖ్యలో కంపెనీలు హాజరై, వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు కంపెనీలతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
*ప్రతిపక్షాలకు నా సూటి ప్రశ్న…*
సెప్టెంబర్ 19న కోదాడలో జరుగుతున్న మెగా జాబ్ మేళాపై విమర్శలు చేస్తున్న వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో కోదాడలో నిరుద్యోగ యువత కోసం ఇలాంటి మెగా జాబ్ మేళాలు ఎన్ని నిర్వహించారు? ఎన్ని కంపెనీలను కోదాడకు తీసుకొచ్చారు? ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు?ఆ వివరాలను నిరుద్యోగ యువతకు, ప్రజలకు చెప్పి ఆ తర్వాత విమర్శలు చేయండి. ఒక కంపెనీ వచ్చింది లేదు ఒక నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించింది లేదు.
*నిరుద్యోగ యువత కోసం ఒక కార్యక్రమం*
నిరుద్యోగ యువత కోసం ఒక కార్యక్రమం జరుగుతుంటే దానిని స్వాగతించాల్సింది పోయి బురదజల్లే ప్రయత్నం చేయడం ఎందుకు?విమర్శలు చేయడం చాలా సులభం… కానీ వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వేదికను ఏర్పాటు చేయడం ముఖ్యం.
*ఉద్యోగం రాజకీయాలకు అతీతం*
ఒక యువకుడికి ఉద్యోగం వస్తే అది ఏ పార్టీకి వచ్చిన ఉద్యోగం కాదు. ఆ ఉద్యోగం ఆ యువకుడి కుటుంబానికి వచ్చే భరోసా.
ఒక యువతికి ఉద్యోగం వస్తే ఆమె కుటుంబానికి వచ్చే ఆత్మవిశ్వాసం. అందుకే ఈ జాబ్ మేళాను రాజకీయ కోణంలో చూడకుండా నిరుద్యోగ యువత భవిష్యత్తు కోణంలో చూడాలని ప్రతిపక్ష నాయకులను కోరుతున్నాను. ఈ జాబ్ మేళాలో ఏమైనా లోపాలు ఉంటే ఆధారాలతో ప్రశ్నించండి. పారదర్శకతపై సందేహాలు ఉంటే అధికారులను అడగండి. సూచనలు ఇవ్వండి. కానీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతలో అనవసరమైన అపోహలు, అయోమయం సృష్టించవద్దు. గతంలో చేయని కార్యక్రమం ఇప్పుడు చేస్తుంటే… స్వాగతించలేరా?
*నా ప్రశ్న చాలా సూటిగా ఉంది.*
గతంలో కోదాడలో ఇలాంటి స్థాయిలో జాబ్ మేళా నిర్వహించని వారు… ఇప్పుడు జాబ్ మేళా నిర్వహిస్తుంటే ఎందుకు విమర్శిస్తున్నారు?యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం మీకు ఎందుకు ఇబ్బంది?
కంపెనీలు కోదాడకు రావడం తప్పా?
యువతకు ఇంటర్వ్యూలు జరగడం తప్పా?
ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నించడం తప్పా?
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా స్వాగతించడం నేర్చుకోవాలి. యువతకు నా విజ్ఞప్తి
ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా, మీ భవిష్యత్తు కోసం మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సెప్టెంబర్ 19, 2026 ఉదయం 8:00 గంటల నుంచి kodadmegajobmela.com వెబ్సైట్ లో అర్హత ఉన్న ప్రతి నిరుద్యోగ యువతీ యువకుడు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుని, రెజ్యూమ్, విద్యార్హత ధ్రువపత్రాలు, అవసరమైన పత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలి.
*రాజకీయాలు ఎన్నికల సమయంలో ఉంటాయి*
యువత భవిష్యత్తు మాత్రం ప్రతిరోజూ ముఖ్యం. కాబట్టి జాబ్ మేళాను విజయవంతం చేయడం మనందరి బాధ్యత. యువతకు ఉద్యోగం రావడమే మనందరి లక్ష్యం కావాలి.
బాణాల కవిత నాగరాజ్ మాజీ జిల్లా పరిషత్ సాంఘిక సంక్షేమ స్థాయి సంఘం చైర్‌పర్సన్
మాజీ జెడ్పిటిసి, నడిగూడెం



