Wednesday, September 16, 2026
[t4b-ticker]

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే విమర్శలా?

నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే విమర్శలా

:మీ ఐదేళ్ల పాలనలో ఎన్నడైనా జాబ్ మేళాలు నిర్వహించారా?

:ఉద్యోగాల కోసం నగరాల్లో కంపెనీల చుట్టూ తిరగలేని పేదవాళ్లకు జాబ్ మేళా పెడుతుంటే విమర్శలు ఎందుకు?

:ఉత్తమ్, పద్మావతిల ఆదరణను తట్టుకోలేక విమర్శలు

:డైవర్షన్ పాలిటిక్స్ కావు…..
ప్రజల మద్దత్తు ఉన్న పాలిటిక్స్

:మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శలు మానుకోవాలి

:కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 16 : నిరుద్యోగ యువతీ యువకులకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు నిర్వహిస్తుంటే మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నాయకుడు రావెళ్ల కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లి కంపెనీల చుట్టూ తిరిగే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్యతరగతి యువతకు జాబ్ మేళాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గత ఐదేళ్ల పాలనలో ఒక్కసారైనా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా అని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతుండటాన్ని చూసి తట్టుకోలేకనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. యువత కు మేలు జరుగుతుంటే రాజకీయ విమర్శలకు దిగడం మానుకోవాలని హితవు పలికారు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదని, ప్రజల కోసం దమ్ముతో పనిచేసే పాలిటిక్స్ అని స్పష్టం చేశారు. ఇకనైనా నిరాధార విమర్శలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహకరించాలని రావెళ్ల కృష్ణారావు సూచించారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular