నిరుద్యోగ యువతి యువకుల్లారా కోదాడకు కదలిరండి.
:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల చొరవతో మెగా జాబ్ మేళాలో 300 ప్రముఖ కంపెనీలు.
:మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 18(ప్రతినిధిమాతంగి సురేష్): నేడు కోదాడ లోని సిసి రెడ్డి స్కూల్ నందు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ల ఆధ్వర్యంలో నిరుద్యోగుల కొరకు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కోసం నడిగూడెం గ్రామ, మండల కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గల తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు కోదాడకు తరలివచ్చి ఈ మెగా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో నిర్వహించి పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ బట్టి కాగితాలతో పొట్ట చేత పట్టుకొని ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు అప్పుచేసి కిరాయి ఇళ్లల్లో హాస్టల్లో ఉంటూ రాత్రి పగలు కష్టపడి చదువుతూ ఒకవైపు ఆకలి చంపుకొని బిస్కెట్లు, టీలతో ఉద్యోగం కోసం ఉద్యోగాలు లేక ఉపాధి కోసం ప్రైవేటు ఉద్యోగల కోసం హైదరాబాద్, విజయవాడ కోదాడ, సూర్యాపేట, ఖమ్మం ఇతర పట్టణాలలో ఉంటున్న నిరుద్యోగ యువత యువకులు ఇది మంచి అవకాశం అన్నారు. గత 32 సంవత్సరాలుగా ఈ ప్రాంతం కోసం వారి జీవితాలను త్యాగం చేసి ఈ ప్రాంతాల భావితరాల కోసం ఒకవైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమం విద్యాలయా తాగునీరు, సాగునీరు లు హాస్పటల్, రోడ్లు, ప్రాజెక్టులు, లిఫ్ట్ ఇరిగేషన్లు, కు లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూనే మరోవైపు ఈ ప్రాతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికై సుమారు 300 ప్రముఖ కంపెనీలు తో మాట్లాడి ఈ జాబ్ మేళాను మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పదో తరగతి నుండి ఉన్నత చదువు చదివిన నిరుద్యోగ యువకులు పాల్గొని ఉద్యోగుల పొంది జీవితాలకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ నాయక్, ఉపసర్పంచి ఎలుగురి నాగరాజు, వార్డ్ మెంబర్ దున్న శ్రీకాంత్, కాసాని మాధవి గోపి, ఉపాధ్యాయులు శ్రీధర్, ఈశ్వర్, శ్రీనివాస్, వెంకన్న, నాగరాజు, ఉపేందర్, ధనుజయ్, మహేష్, కృష్ణ, శ్రీనివాస్, నాగరాజు, శైలజ, హేమలత, నాగరాణి, నగేష్, ఉపేందర్, నాయకులు పల్లపు గోపాల్, శ్రీను, వినోద్, సన్నీ, విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.



