Wednesday, September 23, 2026
[t4b-ticker]

అడుగంటుతున్న తమ్మర చెరువు… ఆందోళనలో స్థానికులు!

అడుగంటుతున్న తమ్మర చెరువు… ఆందోళనలో స్థానికులు!

:ఒకప్పుడు నీటితో కళకళలాడిన తమ్మర చెరువు… నేడు నీటి కోసం ఎదురుచూస్తోంది.

:చెరువు ఎండిపోతే… నీరు మాత్రమే కాదు, ఒక ఊరి జీవనాధారం కూడా తగ్గిపోతుంది.

:చెరువును నింపడంలో ఇరిగేషన్ అధికారులు మొద్దు నిద్ర.

:గ్రామస్తులు కనగాల గిరి

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 22(మనం న్యూస్): అడుగంటుతున్న తమ్మర చెరువు ప్రజల త్రాగునీరుకు, పశువుల త్రాగునీరుకు ఆరిపోతున్న ఆశలకు అద్దం అని గ్రామస్తులు కనగాల గిరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర్ ఆయకట్టు కింద ఉన్న గ్రామాలలో చెరువులను ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి నింపించారు మరి మా చెరువులు తమ్మర, బండపాలెం చెరువులు ఏం పాపం చేసుకున్నవి మా చెరువును నింపడంలో ఎందుకు సంబంధిత అధికారులు విఫలం చెందారు అని అన్నారు. తమ్మర చెరువు అడుగంటుతోంది… రేపటి నీటి భద్రతపై అధికారులు బాధ్యత వహిస్తారా గ్రామంలో పాడి పరిశ్రమ కూడా ఎక్కువగానే ఉంటాది. ఊరికి పక్కనే ఉండటంవల్ల పశువులు ఎక్కువ శాతం చెరువుకి వెళ్లి నీళ్లు తాగుతుంటాయి ఈ రెండు చెరువులు నింపకపోతే పశువులకు కూడా నీరు దొరికే పరిస్థితి లేదని అన్నారు. ప్రజల ఆశలు చిగురించాలంటే
తమ్మర, బండపాలెం చెరువులు సాగర్ నీటితో నింపాలి, చెరువు బతికితే ఊరు బతుకుతుంది… ఊరు బతికితే భవిష్యత్తు బాగుంటుంది అని అన్నారు. చెరువులు ఎండిపోతే ఆ బాధ్యత ఇరిగేషన్ అధికారులే వహించాలని గ్రామంలో తీవ్ర నీటి కొత్త ఏర్పడి ప్రజలు, పశువులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని చెరువును నింపి గ్రామంలో ప్రజల, పశువుల త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. లేనిపక్షంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి ఇరిగేషన్ అధికారులు పనితీరుపై వినతి పత్రం అందజేస్తామని అన్నారు.

*సంబంధిత అధికారులను చరవాణి ద్వారా వివరణ అడుగుదామని ఫోన్ చేసిన తీసే పరిస్థితి లేదు*

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular