ఆడపడుచుల ఆత్మ గౌరవం బతుకమ్మ…
బతుకమ్మ వేడుకలకు ఆహ్వానం..
అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు….
ఆడపడుచులందరూ పాల్గొని విజయవంతం చేయాలి…
మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 19 (ప్రతినిధి మాతంగి సురేష్): బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, పూల సౌందర్యానికి ప్రతీక. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఐకమత్యం, స్త్రీల సృజనాత్మకతను చాటిచెప్పే అద్భుతమైన పండుగ బతుకమ్మ అని మున్సిపల్ ఛైర్పర్సన్ ఎర్నేని కుసుమ అన్నారు.
శనివారం కోదాడ బాయ్స్ హై స్కూల్ నందు కోదాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… మహిళా మణులు అందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మాట్లాడుతూ..
బతుకమ్మ అంటే “బతుకు అమ్మా!” అని అర్థం. అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా భావించి, వివిధ రకాల కాలానుగుణ పూలతో బతుకమ్మను పేర్చి, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మహిళలు, బాలికలు సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకుంటారని తెలిపారు. బతుకమ్మ పండుగ రోజు వారి విశిష్టత గురించి వివరించారు.
బతుకమ్మ పండుగ విశిష్ఠత
ప్రకృతి ఆరాధన తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి పూలతో ప్రకృతిని పూజించడం జరుగుతుందన్నారు.
గౌరీదేవిని పూజిస్తూ మహిళల జీవన సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సును ఆకాంక్షించడం స్త్రీల గౌరవం అని అన్నారు. కులమత భేదాలు లేకుండా మహిళలంతా ఒకచోట చేరి పండుగ జరుపుకోవడం బతుకమ్మ ప్రత్యేకత అన్నారు. జానపద పాటలు, ఆటలు, సంప్రదాయ దుస్తులు, పూల అలంకరణలతో ప్రాంతీయ వారసత్వాన్ని కాపాడుకోవడం, స్థానికంగా లభించే పూలను ఉపయోగించడం ద్వారా ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేయడం, బతుకమ్మను సాధారణంగా ఆశ్వయుజ మాసంలో మహాలయ అమావాస్య నుంచి తొమ్మిది రోజులపాటు జరుపుకుంటారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పేరు, నైవేద్యం, ఆచార ప్రాధాన్యం ఉంటాయి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, నూనె సులోచన, స్థానిక నాయకులు కౌన్సిలర్ వంగూరి గోపి, కొల్లు చత్రయ్య, మందలపు శేషయ్యః, మైలారి శెట్టి భాస్కర్, మల్లె కొండలు, ఎర్నేని రత్న కుమార్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ వివరాలు :
బతుకమ్మ పండగ షురూ.. తొలి రోజు విశిష్టత :
1. ఎంగిలిపూల బతుకమ్మ
2026 అక్టోబర్ 10 · మహాలయ అమావాస్య :
బతుకమ్మ పండుగకు ఇది తొలి రోజు. తంగేడు, గునుగు తదితర పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజిస్తారు.
నైవేద్యం: నువ్వులు, బియ్యంపిండి లేదా నూకలతో చేసిన పదార్థాలు.
2. అటుకుల బతుకమ్మ : అక్టోబర్ 11
కుటుంబంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. నైవేద్యం: అటుకులు, బెల్లం, ఉడికించిన పెసరపప్పు లేదా శనగపప్పు.
మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఏం చేస్తారంటే!! |
3. ముద్దపప్పు బతుకమ్మ..
అక్టోబర్ 12
అమ్మవారి అనుగ్రహంతో ఆరోగ్యం, ఆనందం, కుటుంబ ఐకమత్యం కలగాలని కోరుకుంటారు.
నైవేద్యం: ముద్దపప్పు, పాలు, బెల్లం.
4. నానబియ్యం బతుకమ్మ
అక్టోబర్ 13
ధాన్యసంపద, కుటుంబ సౌభాగ్యం, సమృద్ధి కోసం గౌరమ్మను కొలుస్తారు.
నైవేద్యం: నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం.
5. అట్ల బతుకమ్మ
అక్టోబర్ 14
స్త్రీలు సంప్రదాయంగా బతుకమ్మ పాటలు పాడుతూ, గౌరమ్మకు పూజలు చేసి కుటుంబ క్షేమాన్ని కోరుకుంటారు.
నైవేద్యం: అట్లు లేదా దోశలు.
6. అలిగిన బతుకమ్మ
అక్టోబర్ 15
సంప్రదాయంలో ఈ రోజును విశ్రాంతి దినంగా భావిస్తారు. కొన్ని కుటుంబాల్లో బతుకమ్మ ఆడటం, నైవేద్యం సమర్పించడం చేయరు.
నైవేద్యం: సాధారణంగా ప్రత్యేక నైవేద్యం ఉండదు.
7. వేపకాయల బతుకమ్మ
అక్టోబర్ 16
ప్రకృతి ప్రసాదించిన పూలతో అమ్మవారిని పూజించి ఆరోగ్యం, శుభం కలగాలని కోరుకుంటారు. నైవేద్యం: వేప కాయల ఆకారంలో తయారు చేసిన బియ్యప్పిండి వంటకాలు.
8. వెన్నముద్దల బతుకమ్మ..
అక్టోబర్ 17
గౌరమ్మకు వెన్నముద్దలను సమర్పిస్తూ కుటుంబ సౌఖ్యం, సౌభాగ్యం కోసం ప్రార్థిస్తారు. నైవేద్యం: వెన్న లేదా నెయ్యి, నువ్వులు, బెల్లంతో చేసిన ముద్దలు.
9. సద్దుల బతుకమ్మ
2026 అక్టోబర్ 18 · ప్రధాన వేడుక
ఇది బతుకమ్మ పండుగలో అత్యంత వైభవంగా జరిగే రోజు. పెద్ద బతుకమ్మలను పేర్చి, సామూహికంగా పాటలు పాడి, ఆటలు ఆడి, చివరగా సంప్రదాయం ప్రకారం నీటిలో నిమజ్జనం చేస్తారు. నైవేద్యం: ఐదు రకాల సద్దులు — పెరుగన్నం, పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం.
ఇవి బతుకమ్మ పండుగ విశేషాలు….



