పాలపిట్టను కాపాడుదాం.. జీవవైవిధ్యాన్ని రక్షిద్దాం!
:పాలపిట్ట పరిరక్షణతోనే ప్రకృతి సౌందర్యానికి రక్షణ!
:అంతరించిపోకుండా కాపాడుకుందాం.. పాలపిట్టకు జీవం పోద్దాం!
:పాలపిట్ట మన ప్రకృతి సంపద దాన్ని కాపాడడం మన బాధ్యత.
:కోదాడ అటవీ శాఖ
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): పక్షుల సంరక్షణే పర్యావరణ పరిరక్షణకు తొలి అడుగు! పాలపిట్టకు రక్షణ.. ప్రకృతికి సంరక్షణ!
ప్రకృతికి నేస్తం పాలపిట్ట.. దాని రక్షణ మనందరి బాధ్యత! పాలపిట్టను కాపాడితేనే.. ప్రకృతి సమతుల్యతకు తోడ్పాటు అని కోదాడ అటవీ శాఖ వారు వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ పాలపిట్టలను దేవాలయాలలో పంచరాలలో బంధించొద్దని అలా బంధించితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పాలపెట్టను ఎగరనిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం వాటిని బంధించడం చట్టవిరోధమని వారు అన్నారు. పాలపిట్టను ప్రేమిద్దాం – జీవవైవిధ్యాన్ని కాపాడుదాం, పక్షుల కోసం చెట్లు పెంచుదాం – ప్రకృతికి ప్రాణం పోద్దాం, ప్రకృతిని కాపాడటం మన కర్తవ్యం – పాలపిట్టను రక్షించడం మన బాధ్యత, పాలపిట్టకు రక్షణ కల్పిద్దాం – పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవుదాం, పక్షులు లేని ప్రకృతి బోసిపోతుంది – జీవవైవిధ్యం లేని భూమి జీవం కోల్పోతుంది, పాలపిట్ట మన సంస్కృతికి ప్రతీక… ప్రకృతి సమతుల్యతకు సహాయకారి… దాని సంరక్షణ మనందరి బాధ్యత అని అన్నారు. ప్రజలలో అవగాహన కల్పించడానికి వాల్ పోస్టర్స్ రూపంలో స్టిక్కర్లు అంటించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.



