చౌటుప్పల్‌లో జోగిని దారుణ హత్య.
:భారీ దోపిడీ, కారుతో సహా పరారైన దుండగులు.
:60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.
Mbmtelugunews//చౌటుప్పల్, నవంబర్ 01: యాదా ద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జోగినిగా పేరొందిన రాళ్లబండి సుధాకర్‌ను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేసి, భారీ దోపిడీకి పాల్ప డ్డారు. హత్య అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులాల బం గారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దుండగులు అపహరించారు. అంతటితో ఆగకుండా సుధాకర్‌కు చెందిన కారును సైతం ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు. ఒకే ఘటనలో హత్యతో పాటు భారీ దోపిడీ జరగడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెల కొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి కీలక ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, దుండగుల ఆచూకీ, దోపిడీ వెనుక ఉన్న వ్యక్తుల వివరాలపై దర్యాప్తు ముమ్మరం చే శారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీ యాంశంగా మారింది.



