ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
:వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుధీర్.
:ప్రజలంతా సుభక్షంగా ఉండాలి
:సర్పంచి దున్న శ్రీనివాస్.
Mbmtelugunews/నడిగూడెం 05(ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక శ్రీ శిరిడి సాయిబాబా మందిరములో 25వ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు అనంతరం బాబా వారికి పుష్పాలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబా వారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రులయ్యారు. భజనలు, సత్సంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్, స్థానిక సర్పంచ్ దున్న శ్రీనివాస్ హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగం అని పేర్కొన్నారు. రెండు రోజులపాటు ఎంతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలను నిర్వహించిన కమిటీ సభ్యులను వారు అభినందించారు. భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తాము అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. వారిని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. దాతలను వారు అభినందించారు. వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన దాతలను కమిటీ సభ్యులు సన్మానించారు. తీర్థప్రసాదాల వినియోగం అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఎంతో నిష్టతో అభిషేకాలు, పుష్పాలంకరణ ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పందిరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి అనంతుల కృష్ణయ్య, ఉప సర్పంచి ఎలుగూరి నాగరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



