Monday, November 23, 2026
[t4b-ticker]

ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుక ప్రతిజ్ఞ దివస్…

ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుక ప్రతిజ్ఞ దివస్…

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 23(ప్రతినిధి మాతంగి సురేష్):స్వేరోస్ ఫౌండర్ చైర్మన్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు కోదాడ నియోజకవర్గ స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక రంగా థియేటర్ సెంటర్ వద్ద స్వేరోస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్ మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను స్వేరోస్ ప్రతిజ్ఞ దివస్ గా జరుపుకుంటారని ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్వేరోస్ వివిధ రకాల సేవా కార్యక్రమాలను చేస్తున్నారని తెలియజేశారు.

స్వేరోస్ అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అనే నినాదంతో వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరోస్ నాయకులు చడపంగు రవికుమార్, కొండ భీమయ్యగౌడ్, చడపంగు నాగార్జున, జిల్లపల్లి శివకృష్ణ, విజయనిర్మల, పాముల రాకేష్, కర్ల శివాజీ, అశోక్, దుర్గారావు, రవీందర్, రక్షణ ఫౌండేషన్ సభ్యులు, స్వేరో సభ్యులు పాల్గొన్నారు..

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular