ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం, జూన్ 03(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సర్పంచి గోసుల రాజేష్ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయడం జరిగింది. అనంతరం సర్పంచి మాట్లాడుతూ కార్మికులు అందరూ కూడా వేసవికాలం కనుక తగు జాగ్రత్తలు పాటించాలని అందరికీ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పప్పులు ఉపేందర్, గ్రామ పెద్దలు, ఫీల్డ్ అసిస్టెంట్ అంబేద్కర్, ఆశ వర్కర్ శుక్లావతి తదితరులు పాల్గొన్నారు.



