Saturday, December 27, 2025
[t4b-ticker]

జిల్ జిల్ జిగేల్ సోడా కేరాఫ్ గుడిబండ

.అద్భుతమైన బత్తాయి జ్యూస్ తయారీ

• వేసవి తాపం తీర్చుకునేందుకు భారీగా జనం రాక

కోదాడ,ఏప్రిల్ 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:బగ్గు మంటున్న భానుడు నుండి దాహార్తిని తీర్చి ఉల్లసాన్ని అందించేది నిమ్మకాయ షరబత్,కటోర సోడా,జీరా సోడా,కుల్ఫీ సోడా,ఆరంజ్ సోడా,మసాలా సోడా,సుగంధ సోడా కు కేరాఫ్ అడ్రస్ గుడిబండ.వేసవిలో ఎండ సమయంలో ప్రయాణించే వారు  ఎక్కువగా మార్గ మధ్యలో తమ దాహాన్ని తీర్చుకునేందుకు నిమ్మషరబత్ ని తాగేందుకు ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎక్కువగా మొగ్గు చూపుతారు. వేసవిలో వడదెబ్బకు గురికాకుండ నిమ్మ కాపాడుతుందని వైద్యులు సైతం సూచిస్తున్నారు.దీంతో వేసవిలో నిమ్మ షరబతక్ మంచి గిరాకీ ఉంటాది.ప్రస్తుతం అనేక మంది నిమ్మ షరబత్ అమ్మకాన్ని ఉపాధిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు.వేసవిలో నిమ్మ షరబతుకు ఎండి మతిన్ అండ్ సన్స్ మంచి పేరు సంపాదించింది.కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామం. కోదాడ,మేళ్లచెర్వు ప్రధాన రహదారిపైన ఉన్న గుడిబండ గ్రామం నేడు నిమ్మ షరబత్ కు కేరాఫ్ గా మారింది.కృష్ణపట్టి ప్రాంత మైన మేళ్లచెర్వు మండలంలో అధిక సంఖ్యలో సిమెంటు పరిశ్రమలు ఉండడంతో నిత్యం వందల సంఖ్యలో లారీలు తిరుగుతుంటాయి.వీటితో పాటుగా రహదారి కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాలలోని అనేక గ్రామా. లను కలుపుతుండడంతో నిత్యం అనేక రకాల వాహనదారులతో రద్దీగా ఉంటుంది.ప్రయాణికులు తమ దాహార్తిని తీర్చుకునేందుకు గుడిబండ గ్రామ షరబత్ తీసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు ఇక్కడ ఆగి వివిధ రకాల షరబత్ లు తీసుకుంటారు.దీంతో గ్రామంలోని రామాలయం ఎదురుగా రాగి చెట్టు కింద పరబత్ బండ్లు నిత్యం వాహనదారులతో రద్దీగా దర్శనమిస్తుంటాయి.ఎండి మతిన్ అండ్ సన్స్ షరబత్ రుచిగా నాణ్యతతో కూడి ఉండడంతో ఇక్కడి షరబత్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. దీంతో పాటుగా సుగంధపానీయం కూడా తయారు చేస్తారు. దీంతో నిత్యం ఈప్రాంతం షరబత్ తాగే వారితో రద్దీగా కనిపిస్తుంది.అమ్మకందార్లు ఈ వేసవిలో రోజుకు సుమారు రెండు వేల రూపాయలు సంపాదిస్తు ఉపాధి పొందుతున్నారు.

*గుడిబండలో షరబత్ కోసం ఆగిన వాహనదారులు*.

గత 35 సంవత్సరాలుగా నిమ్మకాయ సోడను అముతున్నాను.నేడు రూ.30కు పెరిగింది.ప్రతి వేసవిలో నిమ్మషరబత్ తో మేము ఆదాయం పొందుతున్నాం మండే వేసవిలో గుడిబండ ఆలయం ఎదురుగా నీడను ఇచ్చురాగి చెట్టు ఉండడం మాకు మేలైంది.వాహనదారులు నీడ కోసం అగి మాషరబత్ తాగుతుంటారు. ఈ షర్బత్ తో మా కుటుంబ జీవనం సాగుతుందని ఎండి మతిన్ అండ్ సన్స్ తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular