కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
కోదాడ,జూన్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నల్లమాద పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలు బాలింతలు రోగులకు బ్రెడ్ పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మందలపు కృష్ణకుమారి శేషు,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి ఉపాధ్యక్షులు ఇర్ల సీతారాం రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ రేవూరి వెంకటాచారి,తోగార్రాయి వేనుగోపాల స్వామి,ఆలయ చైర్మన్ అమరనాయుని వెంకటేశ్వరరావు,కాపుగల్లు మాజీ సర్పంచ్ తొండపు సతీష్,కాపుగల్లు పిఎసిఎస్ ఛైర్మన్ నంబూరి సూర్యం,విజయభాస్కర్,వేనేపల్లి నరసింహారావు తదితరులు ఉన్నారు.



