మృతుని కుటుంబానికి 5000-/రూపాయల ఆర్థిక సాయం.
బిజెపి రాష్ట్ర నాయకులు డా,మల్లెబోయిన అంజి యాదవ్.
Mbmtelugunews//అనంతగిరి, ఫిబ్రవరి 22: అనంతగిరి మండల కేంద్రానికి చెందిన కొండ్రు కోటయ్య అనారోగ్యంతో మృతి చెందిన సంఘటన తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి పార్టీ ఉద్యమంపై పూలమాలవేసి నివాళులర్పించి తక్షణ ఖర్చుల నిమిత్తం 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్. అంజి యాదవ్. ఈ ఆర్థిక సహాయాన్ని బిజెపి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్లె బోయిన వెంకటేష్ బాబు చేతుల మీదుగా మృతుని కుటుంబానికి ఆర్థిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యాన్ని కల్పించారు. ఈయన వెంట నకిరికంటి సుందర్ రావు, కొండ్రు గోపయ్య, మారుతి కొండయ్య, హార్జన్ రావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.



