ఎమ్మెల్యే పద్మావతి, ఉత్తమ్ ల సహకారం తో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా….
:మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు…
Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 23(ప్రతినిధి మాతంగి సురేష్): ఎమ్మెల్యే పద్మావతి, ఉత్తమ్ ల సహకారం తో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. సోమ వారం కోదాడ పట్టణం లోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయం లో మునిసిపల్ చైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్, స్థానిక వార్డు కౌన్సిలర్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు పట్టణ అభివృద్ధి లో భాగ స్వాములు కావాలన్నారు. పట్టణ అభివృద్ధికి కి సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సంఘానికి పేరు తేవాలన్నారు. విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు లు మాట్లాడుతూ మునిసిపల్ పాలక వర్గం పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, కౌన్సిలర్ కొల్లా కోటిరెడ్డి, యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాస్, రఘు, తదితరులు ఉన్నారు.



