Wednesday, February 25, 2026
[t4b-ticker]

ఉద్యోగుల ఆరోగ్య కార్డులు – క్యాష్ లెస్ (ఈహెచ్ఎస్)

ఉద్యోగుల ఆరోగ్య కార్డులు – క్యాష్ లెస్ (ఈహెచ్ఎస్)

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 25( ప్రతినిధి మాతంగి సురేష్):రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షులు మారం జగదీశ్వర్, కార్యదర్శి ముజీబ్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, ఉద్యోగులకు 1.20 కోట్ల ప్రమాద బీమా, 60 సంవత్సరాల లోపు సహజ మరణం చెందితే 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ మంజూరు జేయడం లాంటి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన టీఎన్జీవోఎస్ నాయకులు. అనంతరం పరిశ్రమలు & ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకి, ఐఏఎస్ అధికారుల కమిటీ సబ్యులైన నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, ప్రతేకించి ఐఏఎస్ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావుకి ధన్యవాదములు తెలిపారు.
తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, కార్మిక, ఉపాధ్యాయుల, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ బాగస్వామ్యా ఉద్యోగ సంఘాల నిరంతర కృషి వల్ల ఉద్యోగుల ఆరోగ్య కార్డులు (ఈహెచ్ఎస్), వైద్య విభాగం 010 పద్దుక్రింద జీతాలు తిసూకునే ప్రక్రియా సాద్యమైంది. అలాగే భవిష్యతులో కూడ ప్రధాన డిమాండ్‌లైనా పిఆర్సి పెండింగ్ బిల్లులను నేలకు 700 కోట్ల నూండి 1500 కోట్లకు ఐక్యాంగా ఉండి హక్కులు సాదించుకుంటమని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు టీఎన్జీవోఎస్ జిల్లా నాయకులు వి ప్రకాశ్, ఎన్ రవి, టీఎన్జీవోఎస్ ప్రధాన కార్యదర్శి సూర్యాపేట జిల్లా ఎస్ నవీన్, ట్రైజరరీ ఎన్ ఆంజనేయులు, పర్యవేక్షకులు పి ప్రసాద్, టీఎన్జీవోఎస్ నాయకులు బి ఉమ శ్రీ, సాయి రాంరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ జె లత, జూనియర్ అసిస్టెంట్ వి నాగస్పందన, పి మానస, ఏఈఈ హరిచంద్ర, ఏఈఈ తేజశ్రీ, ఏఈఈ పి ఊర్మిళ, టైపిస్ట్ పులి శ్రీనివాస్, టీఎన్జీవోఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular