రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 01(ప్రతినిధి మాతంగి సురేష్ ): స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఎన్ గీతాంజలి రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపికైంది. పీఎం శ్రీ లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన జిల్లాస్థాయి క్విజ్ పోటీలో ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి గీతాంజలి ని గురువారం అభినందించారు. ప్రతిభను చాటి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో అభినందించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వివిధ సబ్జెక్టులలో విజ్ఞానాన్ని సంపాదించినప్పుడే క్విజ్ పోటీలలో రాణించవచ్చని అన్నారు. గైడ్ టీచర్ ఎం వసంతను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



