Wednesday, October 21, 2026
[t4b-ticker]

ఎండుతున్న పంటలకు సాగునీరు ఎక్కడ ఉత్తమ్?

ఎండుతున్న పంటలకు సాగునీరు ఎక్కడ ఉత్తమ్?

:కొత్త లిఫ్టులు రైతుల ప్రయోజనం కోసమా? మీ కమిషన్ల కోసమా ఉత్తమ్?

:ఇరిగేషన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతల ధర్నా

:మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): నడిగూడెం మండల రైతాంగానికి తక్షణమే సాగునీరు అందించి, ఎండిపోతున్న పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం మండల కేంద్రంలోని నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వాహక ఇరిగేషన్ కార్యాలయం వద్ద రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాగునీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేసి అధికారులకు వినతి పత్రం అందించారు. ఎల్34, ఎల్35, ఎల్36 లిఫ్ట్‌ల ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి, నడిగూడెం మండలంలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. అప్పులు చేసి రైతులు పంటలు పండిస్తున్న సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అధికారులు ఇకనైనా స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం రైతుల సాగునీటి సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పంటలు సాగు చేసిన రైతులకు సకాలంలో నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుబాటులో ఉన్న లిఫ్ట్‌లు, ప్రాజెక్టులు, కాలువల ద్వారా నీటిని విడుదల చేసి పంటలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నడిగూడెం ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే, నీటిని పక్కనే ఉన్న ఖమ్మం జిల్లా పాలేరు ప్రాంతానికి తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా నీటి పంపిణీ చేపట్టడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. “మత్తు నిద్రలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొని నడిగూడెం రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలి” అని బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. చెరువులు నిండి పంటలకు నీరు అందుతుందని ఆశించిన రైతులకు నిరాశ ఎదురవుతోందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎల్34, ఎల్35 ఎల్36 తదితర లిఫ్ట్‌ల ద్వారా సమృద్ధిగా నీటిని విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటనలు చేయడం కంటే, క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడే చర్యలు తీసుకోవడం ముఖ్యమని ఆయన అన్నారు. ఇప్పటికే సాగు చేసిన పంటలకు అవసరమైన నీటిని సకాలంలో అందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సమర్థంగా వినియోగించి, చెరువులను నింపి, ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. సాగునీటి సమస్యపై ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు నీటిపారుదల శాఖ అధికారికి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రైతుల సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular