Tuesday, October 27, 2026
[t4b-ticker]

ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలి

ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం ఆన్‌లైన్‌లో పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవాలి

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్):వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతివక్క పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు పులి వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టభద్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆన్ లైన్ చేసిన పత్రాల పై గెజిటెడ్ సంతకం చేయించి. తహసీల్దార్ కార్యాలయం లో అందించి తమ ఓటు హక్కును పొందాలని కోరారు. వచ్చే నెల 6 వ తేదీ వరకు గడువు ఉందని అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular