Sunday, November 1, 2026
[t4b-ticker]

గుడిబండ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ రైతుల సమావేశం

గుడిబండ రైతు వేదికలో ఆయిల్ ఫామ్ రైతుల సమావేశం

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 31(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామ పరిధిలోని రైతు వేదికలో కోరమాండల్ సంస్థ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి గుడిబండ గ్రామ వీఈవో అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ అధికారులు, వివిధ మండలాల నుంచి ఆయిల్ ఫామ్ రైతులు, సంబంధిత అధికారులు హాజరై పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి మందుల నాగయ్య పాల్గొని మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే రైతులు మొక్కలు నాటే ప్రారంభ దశలోనే వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని, భూసార పరీక్షలు చేయించుకున్న అనంతరం అనుకూలమైన భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను నాటుకోవాలని సూచించారు. మొక్కలను నాటిన తర్వాత వాటిని సరైన పద్ధతిలో సంరక్షిస్తూ, అధికారుల సూచనలను పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అలాగే ఆయిల్ ఫామ్ పంటకు వచ్చే తెగుళ్లు, ఇతర సమస్యల విషయంలో సంబంధిత ఆయిల్ ఫామ్ అధికారులు, వ్యవసాయ అధికారులను ఎప్పటికప్పుడు సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలని రైతులకు సూచించారు. తద్వారా పంట నష్టాలను నివారించుకొని, మంచి దిగుబడులు సాధించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సర్పంచి మందుల నాగయ్య రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కోరమండల్ సంస్థ వారు, వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular