Tuesday, November 10, 2026
[t4b-ticker]

రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన ఎస్ఆర్ఎం స్కూల్ విద్యార్థులు

రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికైన ఎస్ఆర్ఎం స్కూల్ విద్యార్థులు

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జిఎఫ్ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీల్లో ఎస్ఆర్ఎం స్కూల్కు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నవంబర్ 9న కోదాడలోని సిసి రెడ్డి పాఠశాలలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఎస్ఆర్ఎం స్కూల్ కి చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
అండర్-17 విభాగంలో 9వ తరగతి విద్యార్థి ఏ షణ్ముఖ ప్రియ, అండర్-14 విభాగంలో 7వ తరగతి విద్యార్థులు పి ఆర్తిశ్రీ, ఏ తేజవికాస్, యు ఉమామహేశ్ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కేశినేని శ్రీదేవి విద్యార్థులను అభినందించారు. క్రీడలతో పాటు విద్యలోనూ రాణించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను, కోచ్ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular