Sunday, November 15, 2026
[t4b-ticker]

సీనియర్ విలేఖరులని సన్మానించిన దేవాలయ ఈవో

సీనియర్ విలేఖరులని సన్మానించిన దేవాలయ ఈవో

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయాన్ని శనివారం సీనియర్ పత్రిక విలేకరి బంకా వెంకటరత్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో నాగిళ్ల శంబిరెడ్డి, దేవాలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పెండ్లి లచ్చయ్య ల చేతుల మీదుగా కోదాడ ప్రజా దీవెన విలేకరులను శాలువా తో ఘనంగా సన్మానించి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మలు వేదమంత్రాలతో ఆశీర్వాద వచనాలు పలికారు. ఈ సందర్భంగా విలేకరులు దేవాలయ ఈవో, చైర్మన్, దేవాలయ కమిటీ సభ్యులకు అర్చకులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular