బ్రెయిన్ సర్జరీ చిన్నారికి ఆర్థిక చేయూత నందించిన దశరథ ఫౌండేషన్
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 13 ప్రతినిధి మాతంగి సురేష్:మండల పరిధిలోని కూచిపూడి గ్రామానికి చెందిన మాదాసు మహిమ నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 6 వ తరగతి చదువుతూ జారిపడగా బ్రెయిన్ సర్జరీ కావడంతో తల్లి బేబీ యం యస్ విద్యా సంస్థల సీఈవో ఎస్ఎస్ రావు ను సంప్రదించగా దశరథ ఫౌండేషన్(మిర్యాలగూడ) అధ్యక్షులు ఎస్వీవీ ప్రసాద్,ప్రధాన కార్యదర్శి కె.సురేష్ కుమార్ లతో విషయం తెలపగా స్పందించి దశరథ ఫౌండేషన్ గౌరవ సలహాదారు ఎస్ఎస్ రావు ద్వారా మంగళవారం కోదాడ లోని తన గృహంలో 5000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎస్ రావు మాట్లాడుతూ పాపకు భవిష్యత్ లో అండగా ఉంటామని అన్నారు.దాతలు 7893717479 లేదా 9440033633 లకు గూగుల్ పే కానీ ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయం చెయ్యొచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి,కళావతి లు పాల్గొన్నారు.