తమ్మర బండపాలెం లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి.
:రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించాలి.
:కోదాడ అసెంబ్లీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ షేక్ జానిమియా
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 20 ప్రతినిధి మాతంగి సురేష్:భారతదేశ మాజీ ప్రధాని,భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోదాడ అసెంబ్లీ సోషల్ మీడియా కో కోఆర్డినేటర్ షేక్ జానిమియా అన్నారు.మంగళవారం ఆయన జయంతి సందర్భంగా తమ్మర బండపాలెంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి కేక్ కట్ చేసినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం దేశానికి అంకితం,యువతకు ఎన్నో మార్గదర్శకాలను దిశానిర్దేశం చేశాడని పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని రాజీవ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డ్ కౌన్సిలర్ సామిని నరేష్,గ్రామ శాఖ అధ్యక్షులు సోందు,నారాపురాజు రంగారావు,మందరపు అనంతరాములు,రంగారెడ్డి,ఆర్ కే రెడ్డి,భైరబోయిన వెంకటేశ్వర్లు,కాసుల,వెలిది పద్మ,కోదాటి వెంకటేశ్వర్లు,గోపి,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.