జాతీయ మహిళా సమైక్య సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు
Mbmtelugunews//కోదాడ/చిలుకూరు,నవంబర్ 0(ప్రతినిధి మాతంగి సురేష్) చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు జాతీయ మహిళా సమైక్య సభ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు గ్రామంలో చట్టసభల్లో అనేక పోరాటాలు చేసి మహిళా హక్కులను సాధించుకున్నప్పటి కి నేటి పాలకులు వాటిని అమలు చేయడంలో పూర్తిగ వైపల్యం చెందారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.మహిళలు మహిళా సంఘాల్లో చేరి వారి సమస్యల కోసం భవిష్యత్తులో పోరాటాలు చేసి హక్కుల్ని సాధించుకోవటానికి కృషి చేయాలని కోరారు.ఈ సభ్యత్వ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య కార్యదర్శి సాతులూరి అలివేలు,మండల మహిళా సమైక్య నాయకురాలు అపరాధం,నాగేంద్రమ్మ,గ్రామ పార్టీ కార్యదర్శి పోరండ్ల మట్టయ్య,నాయకులు తాళ్లూరి పెద్ద మల్లయ్య,స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు