Sunday, February 8, 2026
[t4b-ticker]

హోరాహోరీగా జాతీయస్థాయి క్రీడా పోటీలు…..

హోరాహోరీగా జాతీయస్థాయి క్రీడా పోటీలు…..

:సెయింట్ జోసఫ్స్ సీసీఆర్ విద్యా నిలయంలో 19వ సీఎస్ఏ క్రీడా పోటీలు……

Mbmtelugunews//​కోదాడ, నవంబర్ 27(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని సెయింట్ జోసఫ్స్ సీసీఆర్ విద్యా నిలయంలో నిర్వహించిన 19వ సీఎస్ఏ జాతీయ స్థాయి క్రీడా పోటీలు రెండవ రోజు గురువారం ఉత్సాహంగా, పోటాపోటీగా జరిగాయి. ప్రిన్సిపాల్ ఆన్ జ్యోతి పర్యవేక్షణలో క్రీడాల కన్వీనర్ సిస్టర్ ఉడుముల శౌరీలు, కరస్పాండెంట్ సిస్టర్ నక్షత్రం రెండో రోజు క్రీడలను ప్రారంభించారు. ​సీనియర్, జూనియర్ విభాగాలలో వాలీబాల్, బాస్కెట్‌బాల్, కోకో, కబడ్డీ, త్రోబాల్, అథ్లెటిక్స్‌లోనూ క్రీడాకారులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఇటువంటి క్రీడలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఐక్యత, స్నేహభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని క్రీడా కోటాలో ఉద్యోగాలు పొందేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని కన్వీనర్ ప్రొవెన్షియల్ మంగళగిరి ఉడుముల శౌరీలు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ,కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన విద్యార్థులు ఒకే వేదికపై తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్రీడలను చూసేందుకు ప్రేక్షకులు భారీగా పాఠశాలకు తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొన్నది……

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular