గుడిబండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పులి వెంకటేశ్వర్లు
Mbmtelugunews// కోదాడ, డిసెంబర్ 10(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పులి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపిక చేసిందని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమాటి నాగిరెడ్డి, కుక్కడపు నాగరాజు కుడుగంట శ్రీనివాస్ రెడ్డి, ఎన్ ప్రసాద్ రెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులి వెంకటేశ్వర్లు గుర్తు హ్యాండ్ బ్యాగ్ పై గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో తన ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి వచ్చిన పులి వెంకటేశ్వర్లను మనందరం కలిసి గెలిపించి గ్రామ అభివృద్ధిలో ముందుండాలని కోరారు.



