సిపిఐ 100సంవత్సరాల
ముగింపు వేడుకలను విజయవంతం చేయండి
Mbmtelugunews//కోదాడ, జనవరి 05(ప్రతినిధి మాతంగి సురేష్): భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు ముగింపు వేడుకల సందర్భంగా జనవరి 18 వ తారీకున ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోదాడ మండల కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బత్తినేని హనుమంతరావు సహాయ కార్యదర్శి పోతురాజు రాజేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు సోమవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర గ్రామంలో స్థానిక బత్తినేని శ్రీనివాసరావు నివాస గృహములో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 19 25 డిసెంబర్ 26వ తారీకు ఉత్తరప్రదేశ్లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ ఆనాటి నుండి నేటి వరకు దేశంలో అంటరానితనము కులవివక్షత జరగాలని దున్నేవానికే భూమి కావాలని వ్యవసాయ కూలీలు పారిశ్రామిక కార్మికులు కూలిరెట్లు పెంచాలని సమసమాజ స్థాపన జరగాలని నిరంతరం పేదల పక్షాన పోరాటం నిర్వహించిన ఏకైక ఎర్ర జెండా కమ్యూనిస్టు పార్టీ అని అని తెలిపారు, జనవరి 18 వ తారీకు ఖమ్మం మహానగరంలో ఐదు లక్షల మంది కార్యకర్తలతో జరిగే భారీ బహిరంగ సభను కోదాడ మండలం నుండి భారీ ఎత్తున తరలి ఖమ్మం సభను విజయవంతం చేయాలని తెలిపారు మండల పరిధిలో ఉన్న మండల పరి ధి ఉన్న అన్ని గ్రామాలలో కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ముగింపు మహోత్సవాలను పండుగ వాతావరణంలో జరుపుకోవాలని నూతన జండాల దిమ్మెల ఏర్పాటు చేసుకోవాలని గ్రామ పుర వీదులలో ఎర్ర తోరణాలతో అలంకరించుకొని ఖమ్మం కదం తొక్కాలని కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాద్, అల్వాల్ పురం గ్రామ కార్యదర్శి గొసు నగేష్, గొట్టేముక్కల కోటి నారాయణ, బత్తినేని శ్రీనివాసరావు, రాయపూడి కాటంరాజు, కమతం కుటుంబరావు, కొండా కోటేశ్వరరావు, సయ్యద్ నాగుల మీరా, నిడికొండ శ్రీనివాసరావు, ఖాజమియా నిడిగొండ రాంబాబు, రేపల్లె శ్రీను, ఎల్లయ్య, అల్వాల శ్రీను, మల్లారెడ్డిగూడెం బాబు, చర్ల నవీన్, మధ్యానపు శీను ,తదితరులు పాల్గొన్నారు



