Friday, March 27, 2026
[t4b-ticker]

కోదాడ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కొత్తా గురవయ్య…

కోదాడ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కొత్తా గురవయ్య…

Mbmtelugunews//కోదాడ, జనవరి 07(ప్రతినిధి మాతంగి సురేష్): మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా చిమిర్యాల గ్రామ సర్పంచ్ కొత్తా గురవయ్యను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కోదాడ మండల సర్పంచుల సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.
ఈ సమావేశంలో మండలంలోని 16 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ కొత్తా గురవయ్యను ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం తోటి సర్పంచులు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కొత్తా గురవయ్య మాట్లాడుతూ, మండల అభివృద్ధి, గ్రామ సమస్యల పరిష్కారం కోసం అందరితో కలిసి పనిచేస్తానని తెలిపారు. సర్పంచుల ఐక్యతతో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని అన్నారు. నా ఎన్నికకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, గ్రామ సర్పంచులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులందరూ గ్రామాలభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు మంత్రి, ఎమ్మెల్యే , సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున నిధులు తీసుకోవచ్చు గ్రామాలలోని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి ఒక్కరు పనిచేయాలని తెలిపారు మండలంలో ఉన్న సర్పంచులంతా ఐక్యమత్యంతో పనిచేసి మండలాన్ని నెంబర్ వన్ మండలం గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సర్పంచుల ఫోరం జనరల్ సెక్రెటరీగా పాలకి సురేష్, ఉపాధ్యక్షులుగా లిక్కి గురవమ్మ, కోశాధికారిగా మందుల నాగయ్య, సలహాదారులుగా పోతురాజు సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అల్సకాని భవాని, డి బాబ్జి నాయక్, పోలంపల్లి కుటుంబరావు, కాసాని సంధ్య, బాదావత్ హాజీ నాయక్, గంగిరెడ్డి తులిశమ్మ, రావుల భవాని, బాణావత్ ఝాన్సీ, గువ్వల శిరీష, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular