Sunday, February 8, 2026
[t4b-ticker]

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Mbmtelugunews//కోదాడ, జనవరి 26( ప్రతినిధి మాతంగి సురేష్): స్థానిక బిజెపి రాష్ట్ర నాయకులు అంజి యాదవ్ నివాసంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెబోయిన వెంకటేష్ బాబు జండా ఎగరవేయడం జరిగినది. అనంతరం వారు మాట్లాడుతూ మన దేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు,
ప్రతి పౌరుడికి హక్కులు కల్పించిన రోజే కాదు,
బాధ్యతలు కూడా గుర్తు చేసిన గొప్ప రోజు అని అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, సమానత్వం, న్యాయం అనే విలువలే మన రాజ్యాంగానికి పునాది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులు,
రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ తో పాటు
అనేకమంది మహానుభావుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరిస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య,నూనె సులోచన, సూర్యాపేట జిల్లా కౌన్సిల్ నెంబర్ సుంకర లింగారెడ్డి, ఓరుగంటి పురుషోత్తం, కట్టగోజు నాగేంద్ర చారి, వంగాల పిచ్చయ్య, జల్లా జనార్దన్ రావు, కొండ్ల రవి, సంపేట భాగ్యరాజ్ గౌడ్, దేవుని రిలక్ష్మి, షేక్ ఖాజాబీ, ఇస్లావత్ రవి నాయక్, కొదుమూరి విశ్వేశ్వరరావు, నునావత్ శీను నాయక్, డి సాంబయ్య, రామచంద్రరావు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular