బొల్లం పై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మెంబర్లకు ఫిర్యాదు
Mbmtelugunews//కోదాడ, జనవరి 27(ప్రతినిధి మాతంగి సురేష్): కోదాడలో బిఆర్ఎస్ బహిరంగ సభ లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ టౌన్ సీఐ శివశంకర్ నాయక్ ను గుడుంబా శంకర్ నిన్ను బట్టలిప్పి కొడతా ఏం చేసుకుంటావురా అని బంజారా బిడ్డను టౌన్ సిఐ పై అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. ఎస్సి, ఎస్టి ఉద్యోగస్తులపై ఇటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఖబర్దార్. అట్టి విషయంపై నేడు అనగా 27/ 1/ 2026న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ డాక్టర్ హుస్సేన్ నాయక్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ బక్కి వెంకటయ్య ని లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వారిని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది.
లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి భూక్య కొట్యానాయక్ తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్మవత్ రాజు నాయక్, మాజీ ఉద్యోగ సంఘాల నియోజకవర్గ అధ్యక్షులు ధారావత్ హాజీ నాయక్, మాజీ కౌన్సిలర్ ధరావత్ స్వామినాయక్, భూక్య సైదా నాయక్, భూక్య రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.



