Tuesday, February 3, 2026
[t4b-ticker]

కేసీఆర్ పై సిట్ అధికారుల తీరును నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

కేసీఆర్ పై సిట్ అధికారుల తీరును నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 01(ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని వ్యక్తిగతంగా అగౌరవపరచడమే ఏకైక లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, చట్టాలను సైతం లెక్కచేయకుండా న్యాయవ్యవస్థను కించపరుస్తూ సిట్ నోటీసుల పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. సిట్ అధికారుల తీరును నిరసిస్తూ, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు కోదాడ మండల పరధిలోని రామ లక్ష్మీపురం గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు అన్నెం అంజిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెల్లంకొండ బ్రహ్మం, అన్నెం వెంకట్ రెడ్డి, పాముల రాజశేఖర్, కొప్పుల లక్ష్మారెడ్డి, సోమిరెడ్డి వెంకట్ రెడ్డి, పాముల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, బుడగసాలు, పాముల రమేష్, జెసిబి రమేష్, మీసాల నాగరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular