Friday, February 6, 2026
[t4b-ticker]

యూరియా పంపిణీని అడ్డుకున్న రైతులు

యూరియా పంపిణీని అడ్డుకున్న రైతులు

Mbmtelugunews//కోదాడ, ఫిబ్రవరి 04(ప్రతినిధి మాతంగి సురేష్): ఆకుపాముల సహకార సంఘంలో ఉదయం 9:30 గంటలకు 444 బస్తాల యూరియాకు మునగాల మండలంలోని రైతులతో పాటు, ఇతర మండలాల రైతులు యూరియా కోసం బుకింగ్ చేసుకున్నారు. కానీ ఆకుపాముల సొసైటీ పరిధిలోని రైతులు కేవలం వాళ్ళ సంఘం పరిధిలోని 5 గ్రామాల రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలని మునగాల మండలంలోని ఇతర గ్రామాల రైతులకు గానీ, ఇతర మండలాల్లోని రైతులకు గానీ యూరియా ఇవ్వద్దని గొడవ చేస్తూ యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగింది. వ్యవసాయ శాఖ సిబ్బంది దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం, యూరియా యాప్, పంపిణీ విధివిధానాలన్నీ వివరించినా కూడా రైతులు ఒప్పుకోలేదు.చివరకు ఆకుపాముల సంఘం పరిధిలోని రైతులంతా కలిసి ఈసారి నుండి వచ్చే లోడ్ లను కేవలం ఆ సంఘ పరిధిలోని 5 గ్రామాల రైతులకు మాత్రమే బుక్ చేసుకుని తీసుకోవాలని, ఆన్లైన్ లో చూసి ఒకవేళ మునగాల మండలంలోని ఇతర గ్రామాలలో రైతులు కానీ, ఇతర మండలాల్లోని రైతులు కానీ ఈసారి నుండి యూరియా బుక్ చేసినట్లయితే వాళ్లకి ఇవ్వకుండా, వెనక్కి పంపాలని తీర్మానం చేసుకొని యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు.రేపు తాడ్వాయి సహకార సంఘంలో పంపిణీ చేసే యూరియాను కూడా ఆ తాడ్వాయి సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు మాత్రమే ఇవ్వాలని, మునగాల మండలం లోని ఇతర గ్రామాల రైతులకు, ఇతర మండలాల రైతులకు ఇవ్వకుండా చూసుకోవాలని రైతులు అనుకుంటున్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular